telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్… ప్రముఖ నిర్మాతకు ఛార్మి ట్వీట్

charmi

నేడు (మే 25) బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పింది నటి, నిర్మాత ఛార్మి కౌర్. ”హాపీయెస్ట్ బర్త్ డే.. మీతో వ్యాపార సహకారం చాలా సరదాగా ఉంది. మీరు పక్కనుంటే ఎప్పుడూ సరదాగా అనిపిస్తుంటుంది. డల్ మూమెంట్ అనేది దరిచేరదు. నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్” అంటూ ట్యాగ్ చేసింది ఛార్మి. ప్రస్తుతం ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ‘ఫైటర్’ సినిమా రూపొందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ మూవీ రూపొందుతోంది.

Related posts