telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవకాశాలు బోలెడు వస్తున్నాయి.. కానీ అటువైపే నా చూపు.. :ఛార్మి

charmi on her offers and root map

చార్మీ తెలుగు తెరకి గ్లామర్ ను పరిచయం చేసిన కథానాయికలలో ఒకరు. అందాల కథానాయికగా కుర్రకారు హృదయాలను దోచుకున్న చార్మీ, ఆ తరువాత హఠాత్తుగా నటనకు కామా పెట్టేసి నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. రేపు చార్మీ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ .. “13 ఏళ్ల వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అన్ని భాషల్లోను కలుపుకుని ఇంతవరకూ 55 సినిమాల్లో నటించాను. కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూశాను.

charmi on her offers and root map కథానాయికగా నేను కొనసాగించిన నా కెరియర్ పట్ల సంతృప్తిగానే వున్నాను. ఇప్పటికీ తమ సినిమాల్లో చేయమంటూ నాకు చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. కానీ నేను సున్నితంగా తిరస్కరిస్తూ, నిర్మాణం పైనే దృష్టి పెడుతున్నాను. ప్రస్తుతం మా నుంచి రానున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఆకాశ్ పూరితో మూవీ త్వరలోనే ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.

Related posts