telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పోకిరి’ వెయ్యి రోజుల పోస్టర్‌ను ట్వీట్ చేసిన ఛార్మి

pokiri

ఎవ్వడు కొడ్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డుల్ని పగలగొట్టి నేటికి సరిగ్గా 14 ఏళ్ళు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’, ‘ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. లాంటి పూరీ మార్క్ డైలాగ్‌లకు మహేష్ బాబు మేనరిజం పర్ఫెక్ట్‌గా సూట్ కావడంతో థియేటర్స్‌లో దుమ్ములేచిపోయింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ ఆ ఇంటర్వెల్ ముందు ముమైత్ ఖాన్ ఊపు. మణిశర్మ అందించిన ఆ బీట్స్‌లో ఒక్క పాట ఒక్కో మైమరపులాగే అనిపిస్తుంది. గలగలపారుతున్న గోదాలలా సాంగ్‌లో ఇలియానా నడుము అందాలు ఇప్పటికీ ఇంటర్నెట్ షేక్ చేస్తుంటాయి. ఇలా ఈ సినిమాకి సంబంధించి చెప్పుకుంటే పోతే చాలానే ఉంది. అయితే ఇండస్ట్రీ రికార్డ్స్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి ‘పోకిరి’ చిత్రంతో బాక్సాఫీస్‌కి గట్టిగానే బుల్లెట్ దింపేసిన ఈ చిత్రం నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ‘పోకిరి’ చిత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా చార్మి ‘పోకిరి’ వెయ్యి రోజుల పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఛార్మి పోస్టుకి మహేష్ ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.

Related posts