telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ కుర్రాడి డ్యాన్స్ కు ఛార్మి ఫిదా…!

charmi on her offers and root map

చార్మింగ్ గర్ల్ ఛార్మి ప్ర‌స్తుతం ఆన్‌స్క్రీన్‌పై కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో సంద‌డి చేస్తుంది. పూరీ క‌నెక్ట్స్ బేన‌ర్‌పై మంచి చిత్రాలు నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ అనే మాస్ మ‌సాలా చిత్రాన్ని నిర్మించ‌గా, ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇందులోని డైలాగ్స్‌, సాంగ్స్ ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి రామ్ వేసిన స్టెప్పులు సినిమాకే హైలైట్‌గా మారాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ పాట లేకుండా ఏ వేడుక జ‌ర‌గ‌డం లేదంటే అతి శ‌యోక్తి కాదు. తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలోని చిల‌కా.. చిల‌కా అనే సాంగ్‌కి ఓ కుర్రాడు ఎంతో ఎన‌ర్జిటిక్‌గా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా కాగా, దీనిపై ఛార్మి స్పందించింది. “నీలో ఎంతో ఎన‌ర్జీ ఉంది. అద్భుతంగా డ్యాన్స్ చేశావు. ఒక‌వేళ నేను అక్క‌డి ఉండి ఉంటే నీతో క‌లిసి డ్యాన్స్ చేసే దాన్ని” అని ఛార్మి త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఛార్మి త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా నిర్మించ‌నుంది.

Related posts