telugu navyamedia
సామాజిక

చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం..

దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్‌ధామ్ యాత్ర(గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్​, కేదార్‌నాథ్​ ఆలయాలు) ఈ రోజు నుంచి ప్రారంభమైంది. గతంలో కరోనా కారణంగా ఈ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వైరస్ అదుపులో ఉండడం, జూన్ 28న యాత్రను నిషేధించిన హైకోర్టు.. తాజాగా స్టే ఎత్తివేసేసింది.

యాత్ర నిబంధనలు ..
అయితే…వ్యాక్సిన్‌ తీసుకున్న, ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌(72 గంటల లోపు) ఉన్నవారిని మాత్రమే యాత్రకు అనుమతించాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్​ ప్రభుత్వం యాత్రకు సంబంధించి కరోనా గైడ్ లైన్స్ జారీ చేసింది.

केदारनाथ धाम फिर होगा भक्तों से गुलजार

అలాగే ఈ యాత్రలోని దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని కూడా విధించిన హైకోర్టు. బద్రీనాథ్‌కు రోజుకు 1000 మంది, కేదార్‌నాథ్‌కు 800 మంది, గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తరాఖండ్​ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారికి వాక్సిన్ 2 డోసులతో పాటు ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి. యాత్రికులు ముందుగా రిజిస్టర్ చేసుకుని, ఈ-పాస్ తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్పింది.

Related posts