telugu navyamedia
ఆరోగ్యం

గర్భిణిలో వచ్చే మార్పులు ఇవే…!

Pregnancy

రెండవ ట్రైమెస్టర్‌లో గర్భిణుల్లో కొన్ని స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. అవన్నీ సాధారణమైనవే.
1. పొట్టలో కదలికలు మొదలవుతాయి.
2. రొమ్ములు పెద్దవి అవుతాయి.
3. చర్మం సాగటంతో చారికలుగా మొదలవుతాయి.
4. పొట్ట, రొమ్ముల పైన చర్మం దురద పెడుతూ ఉంటుంది.
5. చెక్కిళ్ల మీద నల్ల మచ్చలు (పిగ్మెంటేషన్‌) ఏర్పడతాయి.
6. రాత్రి వేళ కాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. గర్భాశయం ఒత్తిడి రక్తనాళాలు, నాడుల మీద పడటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది.
7. కాలి గిలకలు, చేతులు, ముఖంలో కొంత వాపు కనిపిస్తుంది.
8. నడుము, పిరుదుల్లో నొప్పి, పొట్టలో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించటం కూడా ఈ దశలో సహజమే. గర్భాశయంలో ఉన్న బిడ్డ పరిమాణం పెరగటం వల్ల కలిగే మార్పులివి. గర్భాశయంతో సంబంధం ఉన్న లిగమెంట్స్‌ సాగటం వల్ల తలెత్తే నొప్పులివి. వీటికి భయపడాల్సిన పని లేదు.
9. కొంతమందికి దంతాలు వదులవుతాయి. బ్రష్‌ చేసుకునేటప్పుడు రక్తస్రావం కనిపిస్తుంది. ముక్కు నుంచి కూడా కొద్దిగా బ్లీడింగ్‌ కావొచ్చు. ఇదంతా ముఖంలో వచ్చే వాపు వల్ల కణజాలం లావై ఈ మార్పులు కనిపిస్తాయి.
10. గర్భాశయం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పడి గుండెల్లో మంట (అసిడిటీ) రావొచ్చు.
11. కొందరికి ఐదు లేదా ఆరవ నెల చివర్లో లాగి వదిలినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. నొప్పి, బ్లీడింగ్‌ లేకుండా ఇలాంటి కదలికలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ముందు జరగబోయే ప్రసవానికి సన్నద్ధమయ్యే క్రమంలో గర్భాశయంలో చోటు చేసుకునే మార్పులివి.

Related posts