telugu navyamedia
andhra political Telangana

తెలంగాణ  ఎన్నికల ప్రభావం ,ఎపి రాజకీయం ఎలా మారబోతుంది?

Ap Politics,Telangana Elections Results
తెలంగాణలో ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ కలయికతో పోటీచేసిన ప్రజా కూటమికి విజయావకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వేలతో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై ఒకింత గందరగోళం నెలకొన్నప్పటికీ కూటమి విజయావకాశాలపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో పాటు వచ్చే ఏడాది మేలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా తెలంగాణ లోని పలు జిల్లాల్లో సెటిలర్లు ఏ పార్టీకి ఓటు వేశారనే విషయం ప్రధాన పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సారి పోలింగ్ ఏ పార్టీకి మొగ్గు చూపుతుందనే విషయమై కాంగ్రెస్, టీడీపీలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్టవ్య్రాప్తంగా 70 శాతానికి మించి పోలింగ్ జరగటంతో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో దాదాపు తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పొత్తుతో తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నందున కూటమి విజయంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇక్కడ కనుక గెలిస్తే, జాతీయ స్థాయిలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. ఇదే విన్నింగ్ ఫార్ములాగా, మోడీని దించే ఫార్ములాగా ప్రచారం చేస్తారు. ఇక జగన్, పవన్ ల సంగతి సరే సరి. చంద్రబాబు గ్రాఫ్ పెరిగితే, ఇక వీళ్ళ మాటకు విలువ ఉండదు. ఏపిలో జరిగే ఎన్నికలు చంద్రబాబు – మోడీ మధ్య యుద్ధంలా ఏపి ప్రజలు చూస్తారు. ఈ ఆటలో జగన్, పవన్, అరటిపండులు అవుతారు. రేపు ఈ సమయానికి మొత్తం తెలిసిపోతుంది.
కాగా శుక్రవారం తెలంగాణలో జరిగిన ఎన్నికలు, అనంతర పరిణామాలపై చంద్రబాబు టీటీడీపీ నేతలతో ఫోన్‌లో చర్చించారు. వివిధ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులపై టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అధికారులు కారు గుర్తుకు వేయాల్సిందిగా ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు టీఆర్‌ఎస్ ముఖ్యనేత కేటీఆర్ తిరిగి తామే అధికారంలోకి వస్తామని పోలింగ్ ముగియకముందే ప్రచారం చేయటం, సూర్యాపేట శాసనసభ స్థానంలో పోలింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీష్‌రెడ్డి ప్రచారం నిర్వహించటం, కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తల దాడి తదితర అంశాలన్నింటిపై విచారణ జరపాల్సిందిగా టీటీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది

Related posts

హైదరాబాద్ లో… చంటిబిడ్డను ప్రాణాలు బలిగొన్న.. జూ పార్క్…

vimala p

చంద్రబాబు సమక్షంలో.. వైరిచర్ల కిషోర్ .. టీడీపీలోకి..

vimala p

సాఫ్ట్‌వేర్‌ ప్రియుడి కోసం లక్షన్నర ఇచ్చి మోసపోయిన ప్రియురాలు

vimala p