telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

నాలుగు బిలాలను గుర్తించిన .. చంద్రయాన్-2 … : ఇస్రో

chandrayan-2 latest photos of moon

చంద్రయాన్-2 అతిత్వరలో చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ కానుంది. ఇప్పటికే చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2 చేరిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం ఇప్పుడు మరో రెండు ఫొటోలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న బిలాలను గుర్తించి ఇస్రోకు చేరవేసింది. చంద్రుడిపై జాక్సన్, మాచ్, కొరోలెవ్, మిత్రా అనే నాలుగు బిలాలను గుర్తించినట్లు ఇస్రో ట్విటర్ ద్వారా వెల్లడించింది. జాక్సన్ లోయ చంద్రుడి ఉత్తర ద్రువం వైపున ఉండగా, సుమారు 71.3 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్లు తెలిపింది. ఇక మిత్రా క్రేటర్ సుమారు 92 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్టు ఇస్రో తెలిపింది.

ఆగస్టు 23, 2019న 4,375 కిలో మీటర్ల ఎత్తు నుంచి టెరాన్ మ్యాపింగ్ కెమెరా -2 ద్వారా చంద్రయాన్ ఆ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఫొటోలు మొదటి ఫొటో పంపించిన రెండు రోజులకు చంద్రయాన్2లో ఉన్న కెమెరా తీసీనట్టు తెలిపారు. చంద్రయాన్2 సెప్టెంబర్ 7న ల్యాండ్ కానుంది.

Related posts