telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇస్రో ప్రయత్నం అద్భుతం.. పాకిస్థాన్ మహిళ ప్రశంసలు

Nameera saleem

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ అద్భుతమని పాకిస్థాన్ మహిళా నమీరా సలీమ్ ప్రశంసించారు. కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డిజిటల్ సైన్స్ మేగజీన్ ‘సైంటియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చంద్రయాన్-2 పై స్పందించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైనదని
అభివర్ణించారు.

చంద్రయాన్-2 ప్రయోగం దక్షిణాసియా సాధించిన విజయమని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష రంగమంతా ఈ ప్రయోగం పట్ల గర్వంగా ఉందని అన్నారు. అంతరిక్ష రంగంలో దక్షిణాసియా ప్రాంతంలోని ఏ దేశం ముందడుగు వేసినా, ఈ ప్రాంతమంతటికీ గర్వకారణమేనని చెప్పారు. ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గ్యాలాక్టిక్ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను పాక్ ప్రభుత్వం ‘పాకిస్థాన్ తొలి వ్యోమగామి’గా అభివర్ణించింది.

Related posts