telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రగిరి ఎన్నికల్లో అక్రమాలు..పీవో, ఏపీవోల సస్పెన్షన్

election-commission

చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో గత నెల 11న ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటువేసింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అలాగే ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. చంద్రగిరిలోని ఈ ఐదు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిన్న ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ నిర్వహించింది.

Related posts