• Home
  • వార్తలు
  • చంద్రబాబు వారెంట్‌పై..తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు
రాజకీయ వార్తలు వార్తలు

చంద్రబాబు వారెంట్‌పై..తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు

Chandrababu, withdraw to warrant, demand

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మునగపాక మెయిన్ రోడ్డుపై రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్ష పూరిత సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబునాయుపై కేసులు నమోదు చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.చంద్రబాబుపై కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించాలని తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా అధ్యకుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబుపై కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

డీఎంకే అధినేత స్టాలిన్… తల్లి అస్వస్తత

jithu j

తెలంగాణ కల నెరవేరింది…ఉమ్మడి కాస్తా ప్రత్యేక…

chandra sekkhar

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు తుది విచారణ వాయిదా

vimala t

Leave a Comment