రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్!

Chandrababu Warrant, Shock, Maha Kutami

తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారి అవుతుందనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని గుర్తు చేశారు.

ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ కలిసి చేస్తున్న కుట్ర అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్‌ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారంటూ విమర్శించారు. భాజపా వ్యతిరేకులను అణగదొక్కడమే మోదీ ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా తనకు గిట్టని వారందరికీ మోదీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. 24 గంటల్లో కేసును వాపసు తీసుకోవాలని… లేకపోతే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని సోమిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయడాన్ని నిరసిస్తూ రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు

Related posts

డిజిటల్ రంగంలోకి ఘట్టమనేని వారసురాలు ఎంట్రీ

vimala t

విజయ్ దేవరకొండ అంటే ఎవరు..? షాక్ లో అభిమానులు

nagaraj chanti

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు: రఘువీరా

madhu

Leave a Comment