telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పవన్‌ మనవైపే..విమర్శలు వద్దు: చంద్రబాబు

8th white paper released by apcm babu
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను విమర్శించవద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ఇటీవల తెనాలిలో నిర్వహించిన సభలో చంద్రబాబు పై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కు మద్దతిస్తున్నారంటూ పవన్‌ వ్యాఖ్యానించారు. తాజాగా పవన్‌ను విమర్శించవద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం తో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకొన్నాయి.  
శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా టీడీపీ నేతలతో చంద‍్రబాబు మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌లపైనే విమర్శలు చేయాలని స్పష్టం చేశారు. కోల్‌కతాలో జరిగే ర్యాలీ గురించి టీడీపీ నేతలతో మాట్లాడే క్రమంలో మోదీ, కేసీఆర్‌, జగన్‌లను టార్గెట్‌ చేయాలని టీడీపీ నేతలకు సూచించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారుగా అని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలపగా, పవన్‌ను విమర్శించవద్దని బాబు ఆదేశించారు. పవన్‌ కల్యాణ్‌ మనవైపే ఉన్నారనే సంకేతాలు చంద్రబాబు ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో  హాట్ టాపిక్ గా మారింది.

Related posts