telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు…

chandrababu tdp ap

ఏపీకి ఓ ఫేక్ ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం వచ్చే దాకా అసెంబ్లీని సమావేశపర్చరా..? శాసన సభను నియమాలకు విరుద్దంగా ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా మమ్మల్ని వెకిలి చేస్తున్నారు అని తెలిపారు. పీఆర్ ఆర్డినెన్సును ఒన్ సైడుగా చర్చ లేకుండా ఆమోదించేశారు. వరదలు, వర్షాలపై పంట నష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోంది. ఏడాదిలో లక్షా 25 వేల కోట్లు అప్పులు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడును ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడ్డం కరెక్టేనా అని ప్రశ్నించారు. నా లైఫులో నేనెప్పుడూ జైలులోకి వెళ్లలేదు. పరిటాల రవి హత్య సందర్భంలో కూడా నేను జైలులోకి వెళ్లలేదు. రైతుల విషయంలో సీఎం తీరు నచ్చకే భైఠాయించా. వీరు గాలికొచ్చారు.. గాలికే పోతారు అని అన్నారు. ఫేక్ ఫెలోస్ వచ్చి.. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు. గాల్లో తిరుగుతూ.. గాలి మాటలు చెప్పే సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. అలాగే ఇన్పూట్ సబ్సిడీని నాశనం చేస్తున్నారు. ప్రిమీయం చెల్లించకుండా పంటల బీమా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ప్రిమీయం కట్టి ఉంటే.. బీమా వచ్చేది.. కానీ జగన్ చేతకాని తనం వల్ల రైతులు నష్టపోతున్నారు. సొంత బీమా పెడతామంటూ కబుర్లు చెబుతున్నారు. నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు.. నాకు చెబుతారా..అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ పూనకంలో ప్రజలు ఓటేశారో..? రాష్ట్రం ఇలా అయింది.  ప్రజల కోసం నా జీవితంలో ఏనాడూ పడనన్ని తిట్లు పడుతున్నాను. జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తే ఎంతో సంతోషించా. నా కోసం ఏనాడూ అభివృద్ధి చేసుకోలేదు.. ప్రజల కోసమే చేశాను. అమరావతిని నాశనం చేస్తూ డ్రామాలాడతారా..? విశాఖలో జరిగిన భూ లావాదేవీలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా.. అని అడిగారు. బుల్లెట్ బాగా దిగిందంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ ఇదే విధంగా మాట్లాడితే మైండ్ యువర్ టంగ్ అని హెచ్చరించాను. వైఎస్సారుకు ప్రజలంటే భయముంది.. జగనుకు ఆ భయం లేదు అని అన్నారు.

Related posts