telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నేడు చంద్రబాబు .. ప్రకాశం పర్యటన ..

CM Chandrababu fire to CEC

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల చిన్నగంజాం మండలం రుద్రామాంబపురంలో వైసీపీ దాడితో అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ బసంగారి పద్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

ఆ కుటుంబానికి పార్టీ తరఫున బాబు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు రుద్రామాంబపురం తరలి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Related posts