telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్వేతపత్రాలపై .. చంద్రబాబు సానుకూల స్పందన..

chandrababu

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం మంత్రిత్వశాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా అసలు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

అదే ప్రభుత్వ అధికారులు అటు టీడీపీ, ఇటు వైసీపీ హయాంలోనూ ఒక్కరేనని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాల్లో ఏం చెబుతుందో చూశాకే తాము స్పందిస్తామని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. టీడీపీ పాలన అద్భుతంగా ఉన్నందుకే కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు.

Related posts