telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విమానాశ్రయంలో కొనసాగుతున్న చంద్రబాబు నిరసన…

చంద్రబాబు మూడు గంటలు పైగా రేణిగుంట విమానాశ్రయంలో నేలపైనే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కనీసం కుర్చీలో అయినా కూర్చోవాలని పోలీసులు చెప్పినా…కుర్చీపై కూడా కూర్చోకుండా నేలపైనే కూర్చున్న చంద్రబాబు కాళ్ళ నోప్పితో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. బయటకు పంపే వరకు నేలపై కూర్చుంటానని ఆయన చెబుతున్నారు. ఇక మరో పక్క విమానాశ్రయానికి తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు, ఆర్డీవో కనక నరసారెడ్డి చేరుకున్నారు.    విమానాశ్రయంలో ఆందోళన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుతో ఎస్పి,  ఆర్డిఓ చర్చిస్తున్నారు. అంతకు ముందు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ వెంకటఅప్పల నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి 11 తర్వాత స్థానిక టీడీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారని, అనుమతి లేఖ లో ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న విషయం ప్రస్తావన లేదని అన్నారు. నిరసన దీక్ష చేస్తామన్న ప్రదేశం తిరుపతి లో అత్యంత కీలకమైనదని,  భక్తులు యాత్రికులు వచ్చే ప్రదేశం లో దీక్షకు అనుమతి ఇవ్వలేమని అన్నారు. కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నాయని  దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగుతుందని అప్పటికీ సమాచారం ఉందని ఆయన అన్నారు.  దానిని దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించామని పేర్కొన్నారు. 

Related posts