telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఢిల్లీ ధర్మదీక్ష నిర్వీర్యం చేసేందుకే.. మోడీ ఏపీకి.. : చంద్రబాబు

chandrababu on modi tour in ap

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ ఏపీసీఎం చంద్రబాబు ధర్మదీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షను ఢిల్లీలో చేయాలనీ సంకల్పించారు. ఇంతలో మోడీ ఏపీ లో పర్యటనకు వస్తున్నారు. దీనితో మండిపడ్డ చంద్రబాబు స్పందిస్తూ, ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వీర్యం చేయడానికే ప్రధాని మోడీ ఏపీ వస్తున్నారని అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మోదీ ఏపి పర్యటన గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో టీడిపి చేస్తున్న ధర్మపోరాట దీక్ష దేశానికే దిక్సూచి అని చెప్పారు. రాష్ట్ర అభివ్రుద్ది కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఈ పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ చేస్తున్న ఈ పోరాటానికి అందరి సంఘీభావం ఉందన్నారు. ఢిల్లీలో దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో కూడా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకుని ప్రతి ఒక్కరూ నిరసనల్లో పాల్గొనాలని సూచించారు.

ప్రధాని మోడీ గుంటూరు పర్యటన రోజున నిరసన దినంగా పాటించాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఒక దుర్దినమని, చీకటి దినమని సీఎం అభివర్ణించారు. పుండు మీద కారం చల్లడానికే మోడీ వస్తున్నారని, చేసిన దుర్మార్గం చూసేందుకు ఆయన వస్తుంటే ఇక్కడున్న దుర్మార్గుడు సహకరిస్తున్నాడని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వాలను అస్ధిర పరుస్తున్నారని, నాయకత్వాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్ బురదలో మోడీ కూరుకు పోయారని, ఈ వ్యవహారంలో పీఎంఓ జోక్యం చేసుకుని దేశానికి అప్రదిష్ట తెచ్చారని చెప్పారు. మోడీ అడుగులు ఆంధ్రప్రదేశ్ ను అపవిత్రం చేస్తాయన్నారు. టీడీపీ శ్రేణులంతా పసుపు చొక్కాలు, నల్ల చొక్కాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అలాగే పసుపు బెలూన్లు, నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన ప్రకటించాలని సూచించారు.

Related posts