telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తప్పుడు వార్తల పేరుతో.. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం.. : చంద్రబాబు

chandrababu

ఏపీ ప్రభుత్వం తాజాగా నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా.. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోపై మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ జీవో ఉందని ఆయన అన్నారు.

ఇటువంటి జీవోలు తెచ్చి ప్రశ్నించడం, విమర్శించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం వంటి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా గొంతుకను నొక్కేయడానికే వైసీపీ పార్టీ దీన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన మీడియ సంస్థలపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టే ఆస్కారాన్ని కల్పించారు. ఈ జీవోని రద్దు చేసే వరకూ అవసరమైతే మేము రోడ్లెక్కి నిరసనలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బాబు ట్వీట్ చేశారు.

Related posts