telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

లెక్కింపు వివరాలు… అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచాలి.. : చంద్రబాబు

chandrababu on amaravati mla quarters

23న ఓట్ల లెక్కింపు పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనితో తీవ్రమైన పోటీ ఉన్న రాష్ట్రాలలో ఫలితాలపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా, ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. వీవీప్యాట్స్ లెక్కింపు, ఈవీఎంల అంశంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అరోరాకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని, విశ్వసనీయతను పెంపొందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతే ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎనభై శాతం మంది ఓటు వేశారని, కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఓటర్లు వాటిని పట్టించుకోకుండా ఓట్లు వేశారని గుర్తుచేశారు. ఆ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు.

Related posts