telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గం ఫై .. పార్లమెంట్ లో : చంద్రబాబు

Chandrababu comments Jagan cases

రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ సీబీఐ ని ప్రయోగించి తొక్కిపెట్టాలని చూస్తుందని పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. ఈ విషయాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు ఆయన ఆదేశించారు. అనుమతి తీసుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారుల జోక్యంపై పార్లమెంట్‌లో లేవనెత్తాలన్నారు. కేసుపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ సీబీఐ అధికారులు ఎందుకు వచ్చారన్నదే ప్రశ్న అన్నారు. ఈ అంశంపై బీజేపీయేతర పక్షాల నేతలందరితో మాట్లాడిన చంద్రబాబు సాయంత్రం ఢిల్లీలో అందరూ కలవాలని నిర్ణయించారు. రాజకీయ ప్రత్యర్థులందరిపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.

అమిత్‌ షా పలాస పర్యటన రాజకీయ స్వార్థమే అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నేతలకు ఆదేశించారు. బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, ఈ విషయం తెలిసే జగన్‌ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మోదీ కనుసన్నల్లో ఈసీని కలిసి ఫిర్యాదు అని జగన్ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఆలయంలో చోరీ ఉపేక్షించేది లేదని చెప్పారు. నిన్న హైకోర్టు నిర్మాణంతో నవ్యాంధ్రలో నవశకం చాటామన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related posts