telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రుల మధ్య కూడా .. మ్యాచ్ ఫిక్సింగ్.. అంటున్న చంద్రబాబు..

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా, ఎబ్బెట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ హుందాతనం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, నోళ్లు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులపై చర్చకు రావాలని కోరినా పట్టించుకోవడం లేదని, సమావేశాలు ప్రారంభమై పదకొండు రోజులు అవుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. సభలో ఏ అంశం చర్చకు వచ్చినా తమకు అవకాశం ఇవ్వడం లేదని, వైసీపీ సభ్యులు తమపై నోరుపారేసుకున్న సందర్భాల్లో సరైన సమాధానం చెప్పాలని, కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నప్పటికీ, తమకు అవకాశం ఇవ్వకపోగా, బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు మాట్లాడుతూ, ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఖర్చు కోసం జగన్ కు కేసీఆర్ నిధులు పంపించారని, ఆ రుణం తీర్చుకునేందుకే భావి తరాల భవిష్యత్ ను తెలంగాణకు జగన్ తాకట్టుపెడుతున్నారని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ల మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’, క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. నదీ జలాలపై, సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వైఖరిని గతంలో జగన్ విమర్శించారని, ఈరోజున కేసీఆర్ ను పొగుడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నింటి గురించి తాము ప్రశ్నిస్తే జగన్ కు కోపం అని, తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related posts