• Home
  • వార్తలు
  • చంద్రబాబు రాకుంటే అరెస్ట్ తప్పదు: ఎస్పీ కతార్
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

చంద్రబాబు రాకుంటే అరెస్ట్ తప్పదు: ఎస్పీ కతార్

babu recall pitition on babli case accepted

ధర్మాబాద్ న్యాయస్థానం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తదితర 15 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న ఆరోపణల పై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఐదేళ్లకు పూర్వమే చార్జిషీట్ దాఖలు చేశామని, ఆ కాపీలను నిందితులుగా పేర్కొన్న వారందరికీ పంపించామని వెల్లడించారు.

అప్పటి వీడియోలు, ఫొటోల ఆధారంగా 16 మందిపై చార్జ్ షీట్ దాఖలైందని పేర్కొన్నారు. కేసులో అభియోగాలు నమోదు చేశాక, విచారణ కోర్టు పరిధిలో ఉంటుందని గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీలోపు కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందాయని స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.

Related posts

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన?

admin

బాబు దీక్షను భగ్నం చేయడానికేనా ?

admin

హరికృష్ణకు ప్రముఖుల నివాళి

vimala t

Leave a Comment