telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సినిమా వార్తలు

బాలకృష్ణను సత్కరించిన చంద్రబాబు 

Chandrababu,Balakrishna,Krish
దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం “కథానాయకుడు” బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించాడు. ఈ సినిమా స్పెషల్ షో వేయించుకొని తన కుటుంబసభ్యులతో, ర్శకుడు క్రిష్, బాలకృష్ణ, మంత్రి దేవినేని ఉమ, పలువురు టీడీపీ నేతలతో కలిసి వీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సినిమా గురించి మాట్లాడుతూ “‘ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో బాలకృష్ణ చాలా అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్ద ఎన్టీఆర్… క్రిష్ దర్శకపటిమ అభినందనీయం” అని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు చంద్రబాబును కలుసుకున్నారు. అనంతరం సీఎం దర్శకనటులిద్దరినీ సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. 

Related posts