telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శిశువుకు ఆది గురువు అమ్మ: చంద్రబాబు

chandrababu gift on may day

శిశువుకు ఆది గురువు అమ్మ అనీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమ్మను గౌరవించడం మనందరి సంస్కారమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ చంద్రబాబు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, చిన్నారి బుద్ధి వికసించేది అమ్మ ఒడిలోనే అని ఏపీ సీఎం తెలిపారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో తల్లిపై ప్రేమ పెంచేలా, తల్లిదండ్రులు సంస్కారం నేర్పించాలని సూచించారు.తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రయోజకులుగా చేస్తుంటే, వాళ్లు మాత్రం తల్లిదండ్రులను ఆశ్రమాలపాలు చేయడం కలచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు

తల్లి, తండ్రి, గురువు, దైవం ఆరాధ్యులని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు నిరంతర స్ఫూర్తి ప్రదాతలని వ్యాఖ్యానించారు. నా తల్లిదండ్రులు కష్టపడి పనిచేసే తత్వాన్నినేర్పారని చంద్రబాబు అన్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పిల్లలు తల్లికి పాదపూజ చేస్తారని తెలిపారు. తల్లిని గౌరవించడం పిల్లలందరికి నేర్పించాలని పునరుద్ఘాటించారు. అందుకే రాష్ట్రంలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

Related posts