telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించినట్టు సమాచారం.

తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్రకుమార్, పంచుమర్తి అనురాధ తదితరులు హాజరయ్యారు.

Related posts