telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు, నారా లోకేశ్ హౌస్ అరెస్ట్

CM Chandrababu fire to CEC

అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేడు పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతం అట్టుడుకుతుంది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. గుంటూరు, పల్నాడుల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 విధించారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలను నిర్వహించడంపై నిషేధం విధించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం ను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీడియాకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరించారు.

మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు ఆయన నిరాహారదీక్ష కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ నిరాహారదీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts