telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీ ని కూడా.. జగన్ లోటస్ పాండ్ అనుకుంటున్నాడు… : చంద్రబాబు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లను తొలగించి, వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకొస్తూ ఇదే ఉద్యోగాల కల్పన అంటూ ప్రచారం చేసుకోవడం ఏం పిచ్చిపనో తనకు అర్థంకావడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇవ్వడం ఎందుకుని ప్రశ్నించారు.

ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాళ్లే లేరని భావిస్తున్నారా? ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా, తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది సీఎం ఇల్లా లేక లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?.. అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

Related posts