telugu navyamedia
andhra news political

ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి: చంద్రబాబు

2 మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై ఏడో శ్వేతపత్రాన్ని సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి అనినిర్మాణానికి తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో రూ. 50 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఎస్ఆర్ఎం, అమృత్, విట్ వంటి వర్సిటీలు వచ్చాయని చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు.

80 వేల హోటల్ గదులు రాజధానికోసం అవసరమని, 2400 కిలో మీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేశామని చెప్పారు. 11 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ ఉంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ట్రాఫిక్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. రహదారులపై గుంతలు ఉండకుండా నిర్వహణ వ్యవస్థను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు. అమరావతిలో అందరికీ ఇళ్లు ఇస్తున్నామని, 500 ఎకరాలు ఇళ్ల కోసం రిజర్వ్ చేసి ఉంచామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Related posts

ఎగ్జిట్‌ పోల్స్‌తో డీలాపడ్డా విపక్షాలు!

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

నేను లైంగిక వేధింపులకు పాల్పడ్డాను.. : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యూటెర్టీ

vimala p