telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఢిల్లీ దీక్షలో .. చంద్రబాబు.. ఇంకా నల్లచొక్కాతోనే..

chandrababu delhi diksha today

రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని బహిరంగంగా నిరసన ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేయాలని ఏపీసీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో దీక్ష తలపెట్టారు. ఈ దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. గత రాత్రే దేశ రాజధానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఎంపీలతో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. నేడు ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే 12 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది.

చంద్రబాబు ఢిల్లీ దీక్షకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. దీక్షకు సంఘీభావం తెలుపుతూ అందులో పాల్గొనేందుకు ఏపీ నుంచి వివిధ సంఘాల నేతలు, విద్యార్థి నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలుపుతూ హాజరుకానున్నారు. ఈ దీక్షతో కేంద్రం మెడలు వంచి, రాష్ట్రానికి రావాల్సినవి చేయించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

నిన్నటి రోజున మోడీ ఏపీకి వచ్చి, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి బహిరంగ సభలో చెప్పిన విషయం తెలిసిందే. దానితోపాటుగానే అధికార పార్టీపై తీవ్రవిమర్శలు కూడా చేశారు. దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే మోడీ పంతం పట్టి ఏపీకి రావాల్సిందే అనుకోని వచ్చాడే తప్ప, పెద్దగా ఆయన రాకకు ప్రయోజనం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పశ్చిమబెంగాల్ లో మమతా అమిత్ షా ను రాష్ట్రంలోకి రానివ్వకపోవటం.. లాంటివి ఇక్కడ కూడా ప్రభావితం అయ్యాయని, దానిని తీవ్రంగా వ్యతిరేకించి, అనుకున్నది సాధించుకోవాలని మోడీ ఈ పర్యటనకు వచ్చినట్టుంది వారు పేర్కొంటున్నారు. 

Related posts