telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఈసీ వ్యవహారశైలి పై ఘాటుగా స్పందించారు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం సమావేశాలు పెడితే తప్పు, మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ సమీక్షలు జరుపుతుంటే ఎవరూ అడగటం లేదని చంద్రబాబు మండిపడ్డారు.అన్ని విధాలుగా మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నీటి సమస్యపై రివ్యూ చేయవద్దంటున్నారని  అన్నారు. పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహారశైలి, వైసీపీ దాడులపై చంద్రబాబుఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులతో చర్చించారు. అలాగే కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల అవసరాలు తీర్చాలని సీఎం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీకి 150కి మించి సీట్లు రావని చంద్రబాబు జోస్యం చెప్పారు. రేపట్నుంచి నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా నేతలను ఆదేశించారు.

Related posts