telugu navyamedia
andhra news political

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. చంద్రబాబు డిమాండ్

chandrababu

వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు పరిశీలించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా మొత్తం యాబై మూడు వేల ఎకరాల భూమి ముంపునకు గురైందన్నారు. ఇందులో ముప్పై వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రైతులకు రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని అని అన్నారు. నెలకు సరిపడా సరుకులు ఇవ్వాలని, దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, సముద్రంలోకి పోయే నీటిని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు మళ్లిస్తే కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు.

Related posts

చీరాలలో .. 70లక్షలు స్వాధీనం చేసుకున్న ఈసీ ..

vimala p

ఎక్కువగా ఫేస్ బుక్ వాడుతుంది.. వృద్దులేనట.. అందుకే అన్ని ఫేక్ న్యూస్.. నివేదిక… 

vimala p

శుభ్రతే కరోనా వైరస్‌కు చక్కటి మందు: యాంకర్‌ సుమ

vimala p