telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిలో రియల్‌ రంగం పడిపోయింది: చంద్రబాబు

chandrababu gift on may day

రాజధాని అమరావతిలో రియల్‌ రంగం పడిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పరిధిలో వ్యవస్థ లేదన్నారు. కూలీలకు కూడా పనిదొరకట్లేదని చంద్రబాబు విమర్శించారు. అమరావతి పరిధిలో రూ. 2 లక్షల కోట్ల విలువైన భూమి ఉన్నప్పటికీ షేర్‌ మార్కెట్‌ మాదిరిగా రాజధానిలో రియల్‌ రంగం పడిపోయిందన్నారు.

పవన విద్యుత్‌ ధరలు తగ్గించాలని 2018లో పిటిషన్‌ వేశామని, 82 కంపెనీలను పార్టీలుగా చేస్తూ పిటిషన్‌ వేశామని తెలిపారు. మేం పిటిషన్‌ వేస్తే 82 కంపెనీలు కోర్టుకు వెళ్లాయని నాయుడు చెప్పారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోందని విమర్శించారు. సీఎం జగన్‌ పులివెందుల పంచాయతీలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. బెదిరింపులు, దౌర్జాన్యాలకు పాల్పడటం వంటివి జగన్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఈతరహా పంచాయతీలు అమరావతిలో కుదరవని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts