telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మార్చ్ 10న .. చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’..

apcm chandrababu biopic audio on 31st
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల బయోపిక్ ల హావా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహానాయకుల బయోపిక్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర తెలిపారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని ప్రకటించారు. 
మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించినట్టు రాజేంద్ర తెలిపారు. చంద్రబాబు జీవితం, రాజకీయ ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు 2016లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సినిమాకు కథ, మాటలు అందించిన పసుపులేటి వెంకటరమణే దర్శకత్వం కూడా వహించినట్టు తెలిపారు.
ఇక ప్రధాని మోడీ, కేసీఆర్ బయోపిక్ లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో అవి కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Related posts