telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేష్ కే .. టీడీపీ పార్టీ పగ్గాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుడికే పగ్గాలు ఇస్తున్నారు. లోకేష్ పై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ, బాబు పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించడం విశేషం. దీనిపై పార్టీలోనే అనేక విమర్శలు తలెత్తుతున్నప్పటికీ, బాబుకు మరో దారిలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తొలుత పార్టీని వీడిన నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం చంద్రబాబు, లోకేశ్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా సమావేశమైన కాపు నేతలు లోకేశ్ కారణంగానే పార్టీ వీడిందని ఆరోపించారు. ఇక, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం లోకేశ్ కారణంగానే పార్టీ ఓడిపోయిందని..దొడ్డి దారిన మంత్రి అయిన లోకేశ్ దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేసారు. ఇప్పుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్ పైన కొత్త చర్చ మొదలైంది.

కొద్ది రోజుల క్రితం టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడే సమయంలో లోకేశ్ కారణంగా పార్టీలో నేతలు ఇబ్బంది పడుతు న్నారని..లోకేశ్‌తో రాజీనామా చేయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ఆయన ససేమిరా అన్నారు. దీంతో వారు పార్టీని వీడారు. అదే విధంగా కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమై..ఆ తరువాత చంద్రబాబుతో భేటీ అయిన కాపు నేతలు సైతం లోకేశ్ మీదనే ఫిర్యాదులు చేసారు. అయితే, చంద్రబాబు పార్టీ మొత్తం తన కంట్రోల్ లోనే ఉందని.. తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం అవే ఆరోపణలు చేసారు. టీడీపీని లోకేశ్ చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

సతీష్ తన ఎమ్మెల్సీ పదవికి..టీడీపీకి రాజీనామా చేసారు. ఆయన అధికారికంగా ఏ పార్టీలో చేరేది స్పష్టం చేయకపోయినా..బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సతీష్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత లోకేశ్ ను టార్గెట్ చేస్తూ ..ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇప్పుడు వరుసగా పార్టీ నేతలు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండంతో పార్టీలో లోకేవ్ భవితవ్యం పైన అనుమానాలు మొదలయ్యాయి. ముందుగా చంద్రబాబు పార్టీ నేతలను ఎలా సమాధాన పరుస్తారనే చర్చ సాగుతోంది. లోకేశ్ వీటి మీద మాత్రం ఎక్కడా ఇప్పటి వరకు స్పందించలేదు.

Related posts