telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అమిత్  షా కొడుకు ఆస్తుల పై దర్యాప్తు జరపరా?

Chandrababu comments Jagan cases
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై  ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు.  ఏపీకి విభజన హామీలు నేరవేర్చాలని అడిగితే ఎదురుదాడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అమిత్  షా తనయుడు ఆస్తులు 16వేల రెట్లు పెరిగితే దర్యాప్తు జరపరా? అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. ఇవాళ అమిత్ షా దేశమంతా తిరిగి నీతి వ్యాఖ్యాలు చెబితే తాము వినాలా? అని సీఎం ప్రశ్నించారు. పలాసలో మాదిరిగా భవిష్యత్తులో బీజేపీ సభలకు ఎవరు హాజరుకారని సీఎం జోస్యం చెప్పారు. 
విభజన అంశాల్లో 10 పూర్తి చేశామని చెప్పాడాన్ని ఆయన తప్పు పట్టారు. బీజేపీది బస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు. న్యాయం చేయమని అడిగితే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయించారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయ్ మాల్యా, నీరవ్ వీరంతా రూ.4వేల కోట్లు దోచుకునిపోతే.. వారిని వదిలేసి.. తనపై ఆరోపణలు చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

Related posts