telugu navyamedia
andhra news political

ఈవీఎంలపై పోరుకు టీడీపీ కార్యాచరణ!

Chandrababu comments Jagan cases

బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని.. ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావనే అంశంపై వివిధ పార్టీలతో కలిసి పోరాడేలా ఏపీ సీఎం చంద్రబాబు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయంటూ గతంలోనూ పలుమార్లు జాతీయ స్థాయిలోఉద్యమించిన చంద్రబాబు.. ఈ అంశంపై మరోమారు ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ఈవీఎంల టాంపరింగ్‌కు అవకాశం ఉందని.. అందుకే అవి నమ్మకమైనవి కావన్నది చంద్రబాబు వాదన. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాతపద్ధతిలోనే ఓటింగ్‌ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఈవీఎంలలో రెండు మూడు నెలల్లోనే రికార్డు మొత్తం చెరిగిపోతుందన్న విషయాన్ని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్తున్నారు. తన పోరాటానికి సన్నాహాకంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

Related posts

బంగారం ధరలు…

vimala p

మోడీ గారడి మాటల‌కు ఓట్లు పడవు: చంద్రబాబు

vimala p

భయానకమైన సుడిగాలి .. దెబ్బతిన్న విమానాశ్రయం..

vimala p