telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

దేశ  రాజకీయాల్లో కీలక నిర్ణయం.. చంద్రబాబే  ప్రధాని అభ్యర్థి ?

Narendra Modi Invites Chandra Babu To Sit Beside Him In Mahabubnagar Meet
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల పై దృష్టి సారించారు. ఇటీవలీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పలువురు జాతీయ నేతలు చంద్రబాబు తరపున ప్రచారం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. అంతే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు కలకత్తాలో విపక్షాలు నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చంద్రబాబును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని  యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో జరిగిన అన్యాయాన్ని ఇతర రాష్ట్రాల్లో జరగకూడదనే ఉద్దేశంతో ఈసీని చంద్రబాబు కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానికి తామేదో భయపడ్డమని వైసీపీ విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  కర్ణాటక , తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు త్వరలో మిగితా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దేశంలో బెజేపీ గ్రాఫ్ రాను రాను తగ్గిపోవడంతో ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదు. 
ఈ తరుణంలో విపక్షాల మద్దతు కూడగట్టడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నారని స్పష్టమవుతోంది. బీజీపీ ప్రభుత్వం ఏపీకీ అన్యాయం చేసిందని ప్రత్యేక హోదా ఇవ్వక పోగా, ఏపీకీ రావాల్సిన నిధులను కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. మరో వైపు చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పితే ఏపీ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే సీఎం ఎవరన్న దానిపై కూడా ఏపీ రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది.  ఇప్పటికే  ప్రతిపక్ష నేతల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్న లోకేశ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా మరో టీడీపీ సీనియర్ నాయకునికి సీఎం పదవి కట్టబెడుతారా అని అనేక సందేహాలు వెలువడుతున్నాయి. 
మరో వైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పచ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బేజీపీ నేతలకు పలుసార్లు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో సభలు నిర్వహిస్తున్న యూపీ సీఎం యోగి తో పాటు అమిత్ షా వంటి నేతల హెలికాప్టర్ లాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. కేంద్ర సర్కార్ అవలంబిస్తున్న తీరు పై పలు సార్లు మండిపడ్డారు. చంద్రబాబు ప్రధాని  అభ్యర్థి గా ప్రకటిస్తే దీదీ కూడా మద్దతు తెలుపుతుందని  జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. 
బీఎస్పీ అధినేత్రి  మాయావతి కూడా  బేజీపీ నేతల పై విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. ఈసీ ఉత్తర్వులను యోగి మళ్లీ ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. 72 గంటల పాటు ఎటువంటి ప్రచార కార్యక్రమాలలోను ఆయన పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఆజ్ఞాపించినప్పటికీ, ఆయన మాత్రం ఆలయాల దర్శనం పేరుతో .. దళితుల ఇంట భోజనాల పేరుతో తిరుగుతూ, ఇదంతా మీడియాలో ప్రసారమయ్యేలా చూసుకుంటున్నారంటూ మాయావతి ఆరోపించారు. ఈ ఇద్దరు మహిళా నేతలు కూడా బేజీపీనీ ఓడించేందుకు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం  జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థి గా చంద్రబాబు ను ప్రకటించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts