యంగ్ హీరో గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో “చాణక్య” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. కాగా… సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ – థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు 4 కోట్లు వస్తే, అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ 2 కోట్లు ఇచ్చిందట. అదేవిధంగా హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నాన్ – థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందట.
previous post