telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ “జబర్దస్త్” నటుడికి యాక్సిడెంట్… గాయాలు

Chalaki-Chanti

గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌కి సంబంధించిన‌ హీరోలు వరుసగా యాక్సిడెంట్ బారిన పడుతున్నారు. ఇలా తెలుగు చిత్రసీమకు చెందిన హీరోలు గాయాల‌ బారిన ప‌డ‌డం తెలుగు సినీ అభిమానుల‌ను క‌ల‌వ‌రపరుస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్‌, నాగ‌శౌర్య‌, శ‌ర్వానంద్‌, సందీప్ కిష‌న్ ఇలా యువ హీరోలు చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డారు. తాజాగా “జ‌బ‌ర్ధ‌స్త్” న‌టుడు చ‌లాకి చంటి రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు, లారీ వెనుక‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చంటిని కోదాడ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని అంటున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో చలాకీ చంటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి సినిమాల‌లోను అడ‌పాద‌డపా నటిస్తున్నాడు.

Related posts