telugu navyamedia
సినిమా వార్తలు

నటి కారుపై మందుబాబుల దాడి

Chahat-Khanna

ప్రముఖ హిందీ బుల్లితెర నటి చాహత్ ఖన్నాకు హోలీ రోజు అత్యంత్య భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. మీడియా సమాచారం ప్రకారం చాహత్ ఖన్నా కారుపై 10-15 మంది మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన ముంబైలోని మలాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు మందుబాబులు నటీమణి కారు డ్రైవర్ ను కొట్టి, కారు అద్దాలను కూడా పగల గొట్టేశారు. చాహత్ ఖన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఆమెకు సాయమందించడానికి అక్కడ ఎవరూ లేకపోయినా… చాహత్ ధైర్యం చేసి కారులోంచి దిగి చెప్పులతో ఆ మందుబాబులు కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. ఈ ఘటనపై భావోద్వేగానికి లోనైన చాహత్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. చాహత్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త నుంచి వేరుగా ఉంటోంది. ప్రస్తుతం చాహత్ ఖన్నా పలు బుల్లితెర షోలతో బిజీగా ఉంది.

Related posts