telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

చడ్డీ గ్యాంగ్ వీరంగం.. రెండు ఇళ్లలో భారీ చోరీ.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..

chaddi gang escaped successfully

చడ్డీ గ్యాంగ్ గంట వ్యవధిలో రెండిండ్లు లూటీ చేసి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.75 వేల నగదు దోచుకున్నారు. నెలలో రెండు సార్లు ఒకే గ్రామంలో దొంగల బీభత్సం ఘటనా స్థలాన్ని డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ అడిషనల్ డీసీపీ యాదగిరి, ఏసీపీ జయరాం పరిశీలించారు. గత నెల అక్టోబర్ 24న కుంట్లూర్ గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ మూడు ఇండ్లల్లో చోరీ చేసి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదును అపహరించుకుపోయిన ఘటన మరువక ముందే మళ్లీ అదే గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. ఇంట్లో నిద్రిస్తుండగా తలుపులు బద్దలుకొట్టి చొరబడిన దుండగులు.. చంపుతామని బెదిరించి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు బీరువాలో ఉన్న నగదును గంట వ్యవధిలోనే రెండు ఇండ్లలో సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.75వేల నగదును దోపిడీ చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ కుంట్లూర్ వార్డు పరిధిలోని కనకదుర్గానగర్ కాలనీలో నివాసం ఉండే సప్పిడి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు రాత్రి నిద్రపోయారు. అర్ధరాత్రి 1:25 గంటలకు గుర్తు తెలియని దుండగులు వెంకట్‌రెడ్డి ఇంటి ఆవరణలోని ఆరేసిన దుస్తువులు ఒంటికి చుట్టుకొని వారి ఇంటి తలుపులు రాయితో బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడి, బెదిరించి నగదు, నగలు దోచుకొని వెళ్లారు.

దోపిడీ దొంగల చోరీ విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైమ్ అడిషనల్ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ జయరాం సీఐ సతీశ్‌తో వెంటనే అదే రాత్రి అక్కడికి చేరుకొని దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి విస్తృతంగా గాలించారు. చెడ్డీ గ్యాంగ్ ఒకే గ్రామాన్ని టార్గెట్ చేసుకొని నెల రోజుల్లోనే రెండుసార్లు దోపిడికి పాల్పడుతుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. దుండగుల ఆచూకీ కోసం10 బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం ఏసీపీ ఎస్.జయరాం తెలిపారు.

Related posts