telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ వీడియో : డ్యాన్సింగ్ అంకుల్ లేటెస్ట్ వీడియో

Dancing-Uncle

సంజీవ్ శ్రీవాస్తవ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆయనకు డ్యాన్సింగ్ అంకుల్ అనే పేరు వచ్చింది. ఇప్పటివరకు సినీ గీతాలకు డ్యాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించారు. తాజాగా తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ చేశారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, భారతీయ గాయకుడు బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన “చాచా నాచ్” అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ డ్యాన్సింగ్ అంకుల్ తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో డాన్సింగ్ అంకుల్ పేరుతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సంజీవ్ శ్రీవాస్తవ ఓ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

Related posts