telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

ఇక ఆవును కొనాలంటే…సర్టిఫికెట్ తప్పనిసరి.. : యూపీసీఎం యోగి

Mamatha Break Yogi Rali West Bengal

యూపీసీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గో అక్రమ రవాణా పేరిట జరిగే మూకదాడులకు తోడు.. పోలీసుల నకిలీ ఎన్‌కౌంటర్‌ హత్యలతో రాష్ట్రం నెత్తురోడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. కనీసం గో అక్రమ రవాణా విషయంలో అయినా బయటపడాలని అనుకున్నారో ఏమో కానీ ఆవుల రవాణ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా ఓ ఆవును ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్లాలంటే తప్పనిసరిగా గో సేవా ఆయోగ్ నుంచి సర్టిఫికెట్ పొందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆవుల తరలింపులో సెక్యూరిటీ కల్పించుకోవాలని సీఎం సూచించారు. గోవులను తీసుకువెళుతుంటే ప్రజలు మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గోవుల తరలింపులో గో సేవా ఆయోగ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నామని సీఎం యోగి చెప్పారు. నిజానికి 2017లో రాష్ట్ర సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆరునెలల్లో జరిగిన ఎన్‌ కౌంటర్లలో 15 మంది మరణించారు. 2018కి మరో 32 మంది అసువులుబాశారు.

Related posts