telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్.. “ట్విట్టర్” కు కేంద్రం నోటీసులు

twitter logo

సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. హ్యాకింగ్ కు గురైన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల ఖాతాల వివరాలను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది.

హ్యాకింగ్ గురైన వారిలో భారతీయులు ఉంటే వారి పూర్తి వివరాలు, హ్యాకింగ్ కారణంగా ప్రభావితమైన డేటా వివరాలు సమగ్రంగా అందించాలని సెర్ట్ ఆదేశించింది. మాల్వేర్లు, ఇతర వైరస్ లతో కూడిన ట్వీట్లు, లింకులను ఎంతమంది భారతీయులు క్లిక్ చేశారు? వారి ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టు హెచ్చరిస్తూ ట్విట్టర్ ఏమైనా సందేశాలు పంపిందా అని సెర్ట్ కోరింది. హ్యాకర్లు ట్విట్టర్ అకౌంట్లపైనే దాడి చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆని సెర్ట్ తన నోటీసుల్లో ప్రశ్నించింది.

Related posts