telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కేంద్రం

Modi Mask

భారత్ లో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక‌, చికిత్స‌పై నుంచి వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెడుతోంది ప్ర‌భుత్వం.. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైనదంటూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. లాక్‌డౌన్‌కు స్వ‌స్తి చెప్పి అన్‌లాక్‌లోకి వెళ్తున్న స‌మ‌యంలో.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు స‌మీక్షించాల‌ని.. కోవిడ్ నిబంధనలు పాటించడం, టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాకినేట్ స్ట్రాటజీని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. పరిస్థితులను కూలంకషంగా అంచనా వేసిన తర్వాతే ఆంక్షలను విధించాలా, సడలించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల‌ని కేంద్రం కోరింది.

Related posts