telugu navyamedia
రాజకీయ

అగ్రరాజ్యాల సరసన భారత్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌ 

Central Home Minister Rajnath Singh India
దేశ ప్రధాని మోదీ పాలనతో అగ్రరాజ్యాల సరసన భారత్‌ చేరిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కడపలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పీవీ సంస్కరణలతో దేశాన్ని మహాశక్తిగా తీర్చిదిద్దితే, అదే సంస్కరణలతో బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు.
కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలు బతికి బట్టకట్టలేవని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాకుండా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా మంత్రం జపిస్తూ కేంద్రానికి సరైన సలహాలు, సూచలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం సాధించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు.

Related posts