telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు వ్యాపార వార్తలు

లక్ష కట్టు.. వ్యాపారం మొదలు పెట్టు, నెలకు 15వేలు పట్టు.. : కేంద్ర ముద్ర పథకం

central govt mudra scheme for unemployed

ఇవ్వాల్టి పరిస్థితులలో అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించడం అసాధ్యం. ఇక ఖాళీగా ఉండటం ఎందుకు ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే, మొదట వచ్చే ప్రశ్న.. పెట్టుబడి. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అన్న ఆలోచన. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందో లేదో అన్న భయం. ఈ భయాలన్నీ నివారిస్తూ మేమున్నామని(ముద్ర పథకం ద్వారా) భరోసా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే చాలు. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ముద్ర స్కీమ్‌లోని ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మెటల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన పనిముట్లను, పరికరాలను తయారు చేయాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేయగలిగితే భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.

ఈ వ్యాపారం కోసం రూ.3.30 లక్షలు అవసరమవుతాయి. దీని కోసం మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.1.80 లక్షలకు ఖర్చవుతుంది. ఇందులో మెషనరీ, వెల్డింగ్ సెట్, బఫింగ్ మోటార్, డ్రిల్లింగ్ మెషీన్, బెంచ్ గ్రైండర్, హ్యాండ్ డ్రిల్లింగ్, హ్యాండ్ గ్రైండర్, బెంచ్, ప్యానెల్ బోర్డ్, ఇతర పరికరాలు వస్తాయి. ముడి సరుకు కు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. రెండు నెలలకు సరిపడా రా మెటీరియల్ వస్తుంది. వాటితో ప్రతి నెల రూ.40 వేల విలువైన సామాగ్రి, రూ.20 వేల విలువైన వ్యవసాయ పనిముట్లు తయారు చేయవచ్చు. జీతభత్యాలు, ఇతర ఖర్చులు నెలకు రూ.30 వేలు. మొత్తం ఖర్చు రూ.3.30 లక్షలు.

ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం సేల్స్ టర్నోవర్ నెలకు రూ. 1.10 లక్షలు ఉంటుందని అంచనా. ఉత్పత్తి ఖర్చు రూ.91,833 అవుతుంది. అంటే లాభం రూ.18,167. తీసుకున్న లోన్‌పై 13% బ్యాంకు వడ్డీ రూ.2,340. ప్రోత్సాహకం 1% ఇస్తే రూ.1,100 కలిసి వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.14,427 లాభం వస్తుంది.

మీరు ఏ బ్యాంకులో అయినా ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పేరు, అడ్రస్, చేయాలనుకునే వ్యాపారం, విద్యార్హతలు, ప్రస్తుత ఆదాయం, రుణం ఎంత కావాలి అన్న వివరాలు వెల్లడించాలి. లోన్ కోసం ఎలాంటి గ్యారెంటీ, ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు.

Related posts