telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇంటికలను…సాకారం చేస్తున్న కేంద్ర.. గృహరుణం..

central govt home loans for

సగటు మనిషికి ఉండే ప్రధానమైన కల, సొంతింటిని నిర్మించుకోవాలని. కానీ ఇప్పటి జీతాలకు, ఉద్యోగాలకు అది అంత సులభం కాదు. అయితే కేంద్రప్రభుత్వం ఇచ్చే కొన్ని గృహరుణాల సాయంతో ఈ కల సాకారం చేసుకోవచ్చు అంటుంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. తాజాగా, తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గృహనిర్మాణం కోసం ఆసక్తి ఉన్నవారు దీనికి వారివారి బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

అయితే దీనికోసం ప్రాధమికంగా ఉండాల్సిన అర్హత, రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ సంవత్సర ఆదాయం ఉండాలి. అలా ఉన్నవారికి గృహరుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీని అందిస్తున్న పథకాన్ని మార్చి 2020 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 93 వేల మంది లబ్దిని పొందారని అన్నారు. సబ్సిడీ కింద కేంద్రం రూ. 1,960 కోట్లను అందించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

Related posts