telugu navyamedia
రాజకీయ వార్తలు

అమర్నాథ్ యాత్రకు అనుమతులు ఇచ్చిన కేంద్రం…

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేయ విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దాదరు అందరూ లేదు నెలలు లాక్ డౌన్ లో ఉండగా బయట అన్నింటిని మూసేసారు. అయితే ఈ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.  ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.  దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అమరనాథ్ ఆలయ ట్రస్ట్ రిలీజ్ చేసింది.  జూన్ 28 నుంచి ఆగష్టు 22 వరకు అమర్నాథ్ యాత్ర ఉంటుందని ప్రకటించింది.  కోవిడ్ నిబంధనలతో అమరనాథుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.  ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి.  ఇక గతేడాది కరోనా కారణంగా యాత్రకు అనుమతించలేదు.  2019లో ఉగ్రవాదుల ముప్పు కారణంగా యాత్ర మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసింది.  కాగా, ఈ ఏడాది ఈ యాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నట్టు ట్రస్ట్ పేర్కొన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts